తిరుచానూరు బ్రహ్మోత్సవాలు
రాష్ట్రపతి దర్శన పర్యటన భద్రతపై జిల్లా ఎస్పీ సమీక్ష
నవభారత్ వెబ్ డెస్క్ తిరుపతి ప్రతినిధి నవంబర్ 3
అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా భద్రతా ఏర్పాట్లు, అలాగే త్వరలో తిరుచానూరు ఆలయ దర్శన పర్యటనకు విచ్చేయనున్న భారత రాష్ట్రపతి భద్రతా చర్యలపై సోమవారం జిల్లా పోలీస్ కమాండ్ కంట్రోల్ కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఎస్పీ మాట్లాడుతూ “బ్రహ్మోత్సవాల సమయంలో భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉన్నందున, ప్రతి విభాగం సమన్వయంతో క్షుణ్ణమైన ప్రణాళికతో పనిచేయాలి. భక్తుల సౌకర్యం, భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు- అలాగే రాష్ట్రపతి దర్శన పర్యటన సందర్భంగా అన్ని భద్రతా విభాగాలు పరస్పర సమన్వయంతో, అత్యధిక అప్రమత్తతతో వ్యవహరించాలని, ఏ చిన్న లోపం జరగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ట్రాఫిక్, పార్కింగ్, షక్తి టీమ్ పర్యవేక్షణ మరియు మహిళా భక్తుల రక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎస్పీ సూచించారు.- ఈ సమావేశంలో అదనపు ఎస్పీలు రవిమనోహరచారి, ఐ. రామకృష్ణ (తిరుమల), నాగభూషణరావు (క్రైమ్), శ్రీనివాసరావు (సాయుధ దళం), డి.యస్.పీలు శ్రీ వెంకటనారాయణ (యస్.బి), భక్తవత్సలం (తిరుపతి), ప్రసాద్ (చంద్రగిరి), రామకృష్ణ ఆచారి (ట్రాఫిక్) తదితర అధికారులు పాల్గొన్నారు.
