పినపాక నవభారత్ వెబ్ డెస్క్ నవంబర్ 06
పనులు శరవేగంగా జరగటం పట్ల ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ధన్యవాదాలు తెలిపారు.వాసవి నగర్ కమిటీ సభ్యులు
మణుగూరు మండలం,అశోక్ నగర్ వాసవి నగర్ లో సుమారు 30 లక్షల రూపాయల వ్యయంతో 40 వేల లీటర్ల ఓ హెచ్ ఎస్ ఆర్ ట్యాంకు నిర్మాణ పనులను పర్యవేక్షించిన మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పీరునాకి నవీన్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతు వాసవి నగర్ లో తాగునీటి సమస్యను స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారి దృష్టికి తీసుకురాగా వారు గత నెల 27వ తారీఖున వాసవి నగర్ కాలనీలో 40 వేల లీటర్ల ట్యాంకు నిర్మాణానికి భూమి పూజ చేయడం పనులు శరవేగంగా జరగటం పట్ల పినపాక నియోజకవర్గ అభివృద్ధిపై పాయంవెంకటేశ్వర్లు గారి చిత్తశుద్ధిని తెలియజేస్తుందన్నారు.అన్ని రంగాల్లో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన చరిత్ర ఒక్క ఎమ్మెల్యేపాయం వెంకటేశ్వర్లు మాత్రమే దక్కుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల నాయకులు గాండ్ల సురేష్,బొజ్జా త్రిమూర్తులు,ఎండి యాకూబ్అలీ, డేగల నరసింహారావు,మహిళా కమిటీ సభ్యులు కొలపిన్ని మానస,గద్దల ఆదిలక్ష్మి,వాసవి నగర్ కమిటీ అధ్యక్షులు కత్తి రాము,రామకృష్ణలు పాల్గొన్నారు.
