Navabharatdaily.com Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణరాజకీయం

స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయడానికి బలంగా ముందుకు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు :-

స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయడానికి బలంగా ముందుకు ఎమ్మెల్యే పాయం

 

పినపాక నియోజకవర్గం ప్రతినిధి నవభారత్  డిసెంబర్ 04:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా పినపాక శాసనసభ్యులు / ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కరకగూడెం మండలంలోని నాలుగు గ్రామపంచాయతీలలో సర్పంచ్ అభ్యర్థులు, వార్డు సభ్యులు, స్థానిక నాయకులతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ప్రజల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థులను పరిచయం చేస్తూ చోప్పాలా గ్రామపంచాయతీ : సర్పంచ్ అభ్యర్థి తోల్లెం సావిత్రి, తుమ్మలగూడెం గ్రామపంచాయతీ : సర్పంచ్ అభ్యర్థి విజయ కుమారి,
🔸 అనంతరం గ్రామపంచాయతీ : సర్పంచ్ అభ్యర్థి మోకాళ్ళ కృష్ణకుమారి
🔸 పద్మాపురం గ్రామపంచాయతీ : సర్పంచ్ అభ్యర్థి తోలం రమేష్,

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచి స్థానిక సంస్థలపై అధికారం సాధిస్తే గ్రామాల అభివృద్ధి వేగం రెట్టింపు అవుతుందని ఎమ్మెల్యే ప్రజలకు హామీ ఇచ్చారు. ముఖ్యంగా—
✔ గ్రామాల్లో స్వచ్ఛత, రోడ్లు, డ్రైనేజ్, తాగునీరు వంటి ప్రాథమిక అవసరాలను అత్యంత ప్రాధాన్యతతో తీర్చడం
✔ మహిళల సంక్షేమం, వృద్ధులు మరియు రైతులకు ప్రత్యేక పథకాల అమలు
✔ పేదలకు ఇండ్లు, నిత్యావసర సేవలు, గ్రామాల్లో శాశ్వత అభివృద్ధి పనులు
✔ యువతకు ఉపాధి అవకాశాలు మరియు గ్రామస్థాయిలో పారదర్శక పరిపాలన
✔ ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేసే నిర్ణయం, ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఎక్బాల్ హుస్సేన్ , టిపిసిసి మెంబర్ చందా సంతోష్ , ఎర్ర సురేష్ , మండల ప్రధాన నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Related posts

అభివృద్ధి పనులను పర్యవేక్షించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు :-

Surya Teja