ఆచార్య రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పుట్టగొడుగుల పెంపకం పరిశోధన కేంద్రం
రైతులకు యువతకు ఆర్థిక లాభాలను చేకూర్చే పుట్టగొడుగుల పెంపకం
ఆచార్య రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ ఆర్ శారద జయలక్ష్మి దేవి
నవభారత్ తిరుపతి ప్రతినిధి అక్టోబర్ 24
తిరుపతిలోని ఆచార్య రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పుట్టగొడుగుల పెంపకం పై విస్తృత పరిశోధనలు దిశగా పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని యూనివర్సిటీ ఉపకరిపతి డాక్టర్ ఆర్ శారద జయలక్ష్మి దేవి తెలిపారు. ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం : భారత వ్యవసాయ పరిశోధనా మండలి ఆధ్వర్యంలో జాతీయ పుట్టగొడుగుల పరిశోధన కేంద్రం ద్వారా శ్రీ వెంకటేశ్వర వ్యవసాయ కళాశాల నందు పుట్టగొడుగుల పెంపకం పై పరిశోధన కేంద్రం ను 2014 సంవత్సరం నుంచి నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు.పుట్టగొడుగుల జాతీయ పరిశోధన కేంద్రం డైరెక్టర్ డాక్టర్ వి.పి శర్మ తో కలిసి తిరుపతి శ్రీ వెంకటేశ్వర వ్యవసాయ కళాశాల నందు ఏర్పాటుచేసిన పుట్టగొడుగుల పరిశోధన కేంద్రాన్ని పరిశీలించడం జరిగింది . ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2014 సంవత్సరం నుంచి ఈ పరిశోధన కేంద్రం ద్వారా రైతులకు, యువకులకు గ్రామీణ మహిళలకు శిక్షణతో పాటు స్వయం ఉపాధిగా పుట్టగొడుగుల పెంపకాన్ని ఎంచుకున్న యువతకు సలహాలు సూచనలు అందిస్తున్నామని తెలిపారు పుట్టగొడుగులలో 35 శాతం ప్రోటీన్ ఉంటుందని మన రాష్ట్రంలో బటన్ ఆయిస్టర్ పాల పుట్టగొడుగులను ఎక్కువగా వాడుతున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పుట్టగొడుగుల పెంపకానికి ఎంతో అనుకూలంగా ఉంటుందని యువత ఈ రంగంలో స్వయం ఉపాధి పొందడంతో పాటు దీనిని ఒక వ్యాపారంగా నిర్వహించడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని తెలియజేశారు. ఇక్కడి పుట్టగొడుగుల పరిశోధన కేంద్రం నందు విత్తన ఉత్పత్తి ( స్పాన్ )కూడా చేపట్టడానికి గల అవకాశాలను పరిశీలిస్తున్నామని తెలియజేశారు. అనంతరం జాతీయ పుట్టగొడుగుల పరిశోధన కేంద్రం, సోలాన్, హిమాచల్ ప్రదేశ్, డైరెక్టర్, డాక్టర్ విపి శర్మ మాట్లాడుతూ భారతదేశంలో ప్రస్తుతం సంవత్సరానికి నాలుగు లక్షల టన్నుల పుట్టగొడుగుల ఉత్పత్తి జరుగుతుందని పుట్టగొడుగుల ఉత్పత్తిని పెంచడానికి వాతావరణ పరంగా ఆంధ్ర రాష్ట్రం ఎంతో అనుకూలమైనదని ఈ సాగును చేపట్టడానికి అధిక స్థలం అవసరం లేదని మరియు తక్కువ పెట్టుబడి తో వ్యవసాయ వ్యర్ధాలను వినియోగించుకొని స్వయం ఉపాధిగా చేపట్టవచ్చని ఈ రంగంలో ఎంట్రీ పీనర్స్ గా ఎదగడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అంతేకాకుండా పుట్టగొడుగులకు ఉన్న గణనీయమైన పోషక విలువల కారణంగా ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు, విటమిన్ బి12 డి విటమిన్ పుష్కలంగా ఉండడం వలన మరియు కొన్ని రకాల పుట్టగొడుగులకు ఉన్న ఔషధ గుణాల వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పుట్టగొడుగుల సాగుకు విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని అందువలన తిరుపతి వ్యవసాయ కళాశాల నందు గల స్వచ్ఛంద పరిశోధనా కేంద్రాన్ని ప్రధాన పరిశోధన కేంద్రంగా అభివృద్ధి చేయడానికి ప్రతిపాదనను సిద్ధం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా పుట్టగొడుగులపై జరుగుతున్న పరిశోధనలను క్షుణ్ణంగా పరిశీలించి తగు సూచనలను ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ ఎం రెడ్డి శేఖర్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం సహ పరిశోధన సంచాలకులు డాక్టర్ వి సుమతి అధ్యాపక పరిశోధన సిబ్బంది పాల్గొన్నారు
