ముంచుకొస్తున్న తుఫాన్ ముప్పు
నాలుగు రోజులు అల్లకల్లోలమే
నవభారత్ అమరావతి అక్టోబర్ 26
ఏపీ పైకి మొంథా తుఫాన్ దూసుకొస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. కాకినాడకు 920 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన ఈ వాయుగుండం పశ్చిమ-వాయవ్య దిశగా పయనించి తీవ్ర రూపాంతరం చెందబోతోంది. సోమవారం తుఫాన్ గా మంగళవారం తీవ్ర తుఫాన్ గా మారి విరుచుకుపడే అవకాశం ఉంది. ఇక మంగళవారం సాయంత్రానికి మచిలీపట్నం, కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. కాగా మొంథా తుఫాన్ హెచ్చరికలతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని జిల్లాల కలెక్టర్ల ను సీఎం చంద్రబాబు నాయుడు అలెర్ట్ చేశారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రత్యేక యాక్షన్ ప్లాన్‌తో రెడీగా ఉండాలని అధికారులను ఆదేశించారు.
